logo

విదేశాల్లో పూల సంబురం

చిత్తూచిత్తూల బొమ్మ.. శివుడి ముద్దూల గుమ్మా.. అంటూ విదేశాల్లోనూ ఇందూరు వాసులు బతుకమ్మను కొలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండే  వారూ ఈ పండుగ అంటే తమకెంతో ఇష్టమని అంటున్నారు. ఎక్కడ,  ఏ హోదాలో

Published : 29 Sep 2022 03:21 IST

(లక్ష్మీప్రియనగర్‌, నిజామాబాద్‌) సింగపూర్‌ తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ప్రతినిధి రమేశ్‌

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

చిత్తూచిత్తూల బొమ్మ.. శివుడి ముద్దూల గుమ్మా.. అంటూ విదేశాల్లోనూ ఇందూరు వాసులు బతుకమ్మను కొలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండే  వారూ ఈ పండుగ అంటే తమకెంతో ఇష్టమని అంటున్నారు. ఎక్కడ,  ఏ హోదాలో ఉన్నా ఇంటి దేవతను మర్చిపోమని చెబుతున్నారు.  తెలంగాణ సంస్కృతికి పట్టాభిషేకం కడుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ ప్రాముఖ్యాన్ని చరవాణి ద్వారా ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

గునుగు పూలకు రంగులు అద్దుతూ..
స్వప్న, న్యూజెర్సీ, అమెరికా (ఆర్యనగర్‌, నిజామాబాద్‌)

చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. అమ్మతో కలిసి గునుగుపూలకు రంగులు అద్దడం, పసుపుతో గౌరమ్మను చేసేదాన్ని. అమ్మ  పాట పాడుతుంటే చప్పట్లు కొడుతూ బొడ్డెమ్మ, తర్వాత బతుకమ్మను పూజించేదాన్ని. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో బిజీగా ఉన్నా సరే.. ఈ పండుగను మాత్రం తప్పకుండా చేసుకుంటాం. స్థానికంగా దొరికే పూలను  వినియోగిస్తున్నాం.


చిన్నారులకు తెలియజేస్తూ..

సింగపూర్‌ తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ప్రతినిధి రమేశ్‌ (లక్ష్మీప్రియనగర్‌, నిజామాబాద్‌)

సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో..

జిల్లా వాసులతో కలిసి ప్రత్యేకంగా సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సంస్థను ఏర్పాటు చేశాం. అందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. మన సంస్కృతి గొప్పదనాన్ని చిన్నారులకు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఈసారి ఉత్తమంగా బతుకమ్మను అలంకరించిన వారికి బహుమతులు అందిస్తున్నాం.


ఆచారాలు మరవకుండా..
గడ్డం వంశీ సౌజన్య, వాషింగ్టన్‌ డీసీ (తొర్లికొండ, జక్రాన్‌పల్లి)

మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించిన బతుకమ్మ పాటలు ఇప్పుడు అమెరికాలో ఉపయోగపడుతున్నాయి. మన పండుగలు, ఆచార సంప్రదాయాలు మరిచిపోకుండా ఉండేందుకు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఏర్పాటు చేసి వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. స్థానిక దుకాణాల్లో గునుగుపువ్వు దొరుకుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని