logo

ఏడుగురు వార్డుసభ్యుల రాజీనామా

రెంజల్‌ పంచాయతీ పరిధిలోని గాంధీ విగ్రహం సమీపంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకవర్గం తీర్మానం చేసినా కార్యదర్శి సంతకం చేయకపోవడం.. కేసులు నమోదు చేస్తామంటూ పోలీస్‌, పంచాయతీరాజ్‌ అధికారులు బెదిరింపులకు

Published : 29 Sep 2022 03:21 IST

రెంజల్‌ ఎంపీడీవో శంకర్‌కు రాజీనామా పత్రాలు అందిస్తున్న రెంజల్‌ పంచాయతీ వార్డుసభ్యులు

రెంజల్‌, న్యూస్‌టుడే: రెంజల్‌ పంచాయతీ పరిధిలోని గాంధీ విగ్రహం సమీపంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకవర్గం తీర్మానం చేసినా కార్యదర్శి సంతకం చేయకపోవడం.. కేసులు నమోదు చేస్తామంటూ పోలీస్‌, పంచాయతీరాజ్‌ అధికారులు బెదిరింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఏడుగురు వార్డుసభ్యులు బుధవారం ఎంపీడీవో శంకర్‌కు రాజీనామా పత్రాలు అందజేశారు. రెండు నెలల క్రితం ఓసారి, తాజాగా మరోసారి తీర్మానపత్రంపై సంతకం చేయకుండా కార్యదర్శి తమను బేఖాతరు చేస్తున్నారన్నారు. సర్పంచి రమేశ్‌కుమార్‌ వారికి మద్దతు ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలో సమస్యకు పరిష్కారం లభించనిపక్షంలో తానూ అదేబాట పడతానని సర్పంచి స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వార్డుసభ్యుల్లో గంగారెడ్డి, రంజిత్‌, సగ్గు వెంకట్‌, లక్ష్మణ్‌, కనకవ్వ, రేఖ, రాణి ఉన్నారు. ఈ విషయమై కార్యదర్శి మధుసూదన్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. పంచాయతీ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు తీర్మానం చేయడం చట్టవిరుద్ధమన్నారు. తీర్మానం చేసే అధికారం పాలకవర్గానికి లేదన్నారు. అయితే శివాజీ విగ్రహం ఏర్పాటు చేయమని ఉత్సవ కమిటీ సభ్యులు తహసీల్దార్‌ రాంచందర్‌, ఎస్సై సాయన్న, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డికి హామీ పత్రం అందజేశారు. ఇటీవల వీరిని పోలీసు, పంచాయతీరాజ్‌ అధికారులు కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో విగ్రహం వద్దు.. కేసులు వద్దని తమ నిర్ణయం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని