logo

గూడు లేక.. భద్రత కరవై..

వృద్ధురాలైన తల్లి.. అనారోగ్యంతో కూతురు.. మతిస్థిమితం కోల్పోయిన మనువరాలు.. ఆకలి కేకలతో కాలం వెల్లదీస్తున్నారు. తల దాచుకునే చోటు లేక దిక్కుతోచని స్థితిలో పడరాని పాట్లు పడుతున్నారు. ఎడపల్లికి చెందిన

Published : 29 Sep 2022 03:21 IST

న్యూస్‌టుడే, ఎడపల్లి: వృద్ధురాలైన తల్లి.. అనారోగ్యంతో కూతురు.. మతిస్థిమితం కోల్పోయిన మనువరాలు.. ఆకలి కేకలతో కాలం వెల్లదీస్తున్నారు. తల దాచుకునే చోటు లేక దిక్కుతోచని స్థితిలో పడరాని పాట్లు పడుతున్నారు. ఎడపల్లికి చెందిన కరీమా(తల్లి), రేష్మ(కూతురు), రుమేషా(మనువరాలు) జీవనం దయనీయంగా మారింది. వీరు రెండు నెలల వరకు స్థానిక ఇందిరమ్మకాలనీలో ఉండేవారు. కరీమా గతంలో అంగన్‌వాడీ ఆయాగా పనిచేసేవారు. మతిస్థిమితం సరిగా లేదని ఉద్యోగం నుంచి తొలగించారు. కూతురు భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. కాలనీలో ఉండే వీరి స్థలాన్ని ఓ స్థానిక వ్యక్తి లాగేసుకుని వెళ్లగొట్టడంతో రోడ్డున పడ్డారు. మండలకేంద్రంలోని కూరగాయల విక్రయ షెడ్డులో ఇలా తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. జాలి మనసున్న కొందరు వీరి ఆకలి తీర్చుతున్నారు. ముగ్గురు మహిళలే కావడంతో వారి ఆత్మరక్షణకు భద్రత లేకుండా పోయింది. ఉపాధి కరవై.. చేతిలో చిల్లిగవ్వ లేక.. గూడుకు దూరమై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు, ఆపన్నులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని