logo

20కిలోమీటర్లు 200 గుంతలు

జామాబాద్‌ నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్‌ నుంచి చందూరు శివారు వరకు సుమారుగా 20 కి.మీ. పరిధిలో 200 వరకు గుంతలు ఏర్పడ్డాయి.

Published : 29 Sep 2022 03:21 IST

ఈనాడు, నిజామాబాద్‌: నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్‌ నుంచి చందూరు శివారు వరకు సుమారుగా 20 కి.మీ. పరిధిలో 200 వరకు గుంతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల రహదారి కోతకు గురైంది. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో గుంతలు కనిపించక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్ని నుంచి చందూరు వరకు ఉన్నట్లు రెండు వరుసల రహదారిగా మార్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని