logo

కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే వరకు ఉద్యమిస్తాం

మద్నూర్‌లో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే వరకు ఉద్యమిస్తామని గ్రామస్థులు అన్నారు. బుధవారం మద్నూర్‌లో గ్రామస్థులంతా కదం తొక్కారు. ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా

Published : 29 Sep 2022 03:21 IST

మద్నూర్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టిన గ్రామస్థులు

మద్నూర్‌, న్యూస్‌టుడే: మద్నూర్‌లో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే వరకు ఉద్యమిస్తామని గ్రామస్థులు అన్నారు. బుధవారం మద్నూర్‌లో గ్రామస్థులంతా కదం తొక్కారు. ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను ముసి ఉంచారు. తహసీల్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్రీయ విద్యాలయం మంజూరైనా ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభించడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎంపీ బీబీ పాటిల్‌ వెంటనే స్పందించి చరవాణిలో గ్రామస్థులతో మాట్లాడారు. మద్నూర్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తానని, అధికారులతో మాట్లాడతానని చెప్పారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్థులు చెప్పారు. దీక్షలు చేసే వారి దగ్గరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడుగు గంగాధర్‌ వచ్చి మద్దతు పలికారు. సర్పంచి సురేష్‌, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ కొంగ గంగాధర్‌, ఉప సర్పంచి విఠల్‌, మాజీ సహకార సంఘం ఛైర్మన్‌ పండిత్‌రావు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల వారు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని