logo

అసంపూర్తి భవనానికి 17 ఏళ్లు

ఈ చిత్రంలో కనిపిస్తున్నది మాక్లూర్‌ మండల కేంద్రంలోని అసంపూర్తి గ్రంథాలయ భవనం. ఏడాది క్రితమో, రెండేళ్ల కిందటో పనులు చేపట్టారనుకుంటే పొరబడినట్లే. 17 ఏళ్ల క్రితం మొదలైన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.

Published : 29 Sep 2022 03:21 IST

న్యూస్‌టుడే, మాక్లూర్‌: ఈ చిత్రంలో కనిపిస్తున్నది మాక్లూర్‌ మండల కేంద్రంలోని అసంపూర్తి గ్రంథాలయ భవనం. ఏడాది క్రితమో, రెండేళ్ల కిందటో పనులు చేపట్టారనుకుంటే పొరబడినట్లే. 17 ఏళ్ల క్రితం మొదలైన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రభుత్వం ఇంతవరకు రూ.26 లక్షలు విడుదల చేసినా ప్రయోజనం శూన్యం. ప్రస్తుతం ఒకటి, అర పనులు మాత్రమే చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో దీన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి. 36 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే గ్రంథాలయం కొనసాగుతోంది. సంబంధిత అధికారులు, గుత్తేదారు తీరు ‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు’ అన్నట్లు తయారైందని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే భవనాన్ని అందుబాటులోకి తేవాలని పాఠకులు వేడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని