logo

ట్యూటర్‌ ప్రైడ్‌ పురస్కారానికి ఎంపిక

ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పొలాస రాములు జాతీయస్థాయి ట్యూటర్‌ ప్రైడ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బడి అభివృద్ధి,

Published : 30 Sep 2022 03:21 IST

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పొలాస రాములు జాతీయస్థాయి ట్యూటర్‌ ప్రైడ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బడి అభివృద్ధి, హరితహారం, డిజిటల్‌, సమర్థ బోధన, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం తదితర అంశాలను పరిశీలించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కిట్స్‌ కళాశాలలో గాంధీ జయంతి రోజున అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఉప్పల్‌వాయి(రామారెడ్డి): ఉప్పల్‌వాయి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎర్రం చంద్రశేఖర్‌కు ఐటాప్‌ ట్యూటర్‌ ప్రైడ్‌ పురస్కారం లభించినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వినూత్న బోధన, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఐడియల్‌ టీచింగ్‌ అవార్డు- 2022 అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ రాజారత్నం కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అవార్డు ఇవ్వనున్నటు వివరించారు. తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆయణ్ను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని