కారులో వచ్చి.. ఇల్లు దోచేసి

కారులో వచ్చి ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నిజామాబాద్‌ మూడో ఠాణా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిజామాబాద్‌ సబ్‌ డివిజన్‌

Updated : 30 Sep 2022 05:56 IST

నిందితుడిపై 18 దొంగతనం కేసులు

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వెంకటేశ్వర్‌

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కారులో వచ్చి ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నిజామాబాద్‌ మూడో ఠాణా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిజామాబాద్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నగరంలోని దుబ్బ ఆదర్శనగర్‌కు చెందిన బేగరి రాజు ఆగస్టు 17న తన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తిరిగి 19న ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని నగలు మాయం కావటంతో బాధితుడు మూడో ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సీసీ టీవీ ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఎరుపు రంగు కారులో వచ్చి చోరీ చేసి వెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పాత నేరస్థుడు రాజుగౌడ్‌ పనిగా గుర్తించి.. అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. మరో నిందితుడు కిరణ్‌ పరారీలో ఉన్నాడు. రాజుగౌడ్‌పై ఇప్పటికే 18 దొంగతనం కేసులు ఉన్నాయి. ఆయన నుంచి 4.5 తులాల బంగారు నగలు, కారు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ శ్రీశైలం, ఎస్సై నరేష్‌, సిబ్బంది అప్సర్‌, వెంకట్రాం, జగన్‌ బృందాన్ని ఏసీపీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని