logo

సిద్ధాపూర్‌తో 14 వేల ఎకరాలకు సాగునీరు

సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పూర్తయితే వర్ని, బాన్సువాడ, గాంధారి మండలాల్లో 14 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. హన్మాజిపేట్‌లో సహకార సంఘం భవనం, రూ.25

Published : 30 Sep 2022 03:21 IST

నస్రుల్లాబాద్‌లో మహిళలు, చిన్నారులతో కలిసి కోలాటం ఆడుతున్న పోచారం దంపతులు

బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, న్యూస్‌టుడే: సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పూర్తయితే వర్ని, బాన్సువాడ, గాంధారి మండలాల్లో 14 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. హన్మాజిపేట్‌లో సహకార సంఘం భవనం, రూ.25 లక్షలతో గోదాం, దుకాణ సముదాయం, క్వార్టర్స్‌, మురుగు కాలువల నిర్మాణం, నక్కల కుంట రోడ్డు, వంతెన, పెద్దకట్టకింద రోడ్డు, వంతెన నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు.  నస్రుల్లాబా ద్‌లో సభాపతి దంపతులు బతుకమ్మ ఆడారు. హన్మాజిపేట్‌లో సర్పంచి సుభాష్‌ అమ్మమ్మ-తాతల జ్ఞాపకార్థం 140 గజాల స్థలం బీడీ కార్మికుల భవనానికి విరాళం ఇవ్వగా.. సభాపతి ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని