logo

బాసరకు వీఆర్‌ఏల పాదయాత్ర

తమ సమస్యలు పరిష్కరించాలని విభిన్న రీతిలో నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు గురువారం నిర్మల్‌ జిల్లా బాసర అమ్మవారి ఆలయానికి  పాదయాత్రగా తరలివెళ్లారు. నవీపేట, బాసర మండలాలకు చెందిన ఉద్యోగులు ముందుగా

Published : 30 Sep 2022 03:21 IST

నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

నవీపేట, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని విభిన్న రీతిలో నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు గురువారం నిర్మల్‌ జిల్లా బాసర అమ్మవారి ఆలయానికి  పాదయాత్రగా తరలివెళ్లారు. నవీపేట, బాసర మండలాలకు చెందిన ఉద్యోగులు ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పూజలు చేసినట్లు వారు పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దయాసాగర్‌, కార్యదర్శి సాయన్న, నవీపేట మండలాధ్యక్షుడు బద్దెం గంగాధర్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని