logo

శారీరక వ్యాయామంతో గుండెకు రక్షణ

రోజు 40 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేస్తే గుండెజబ్బులు దరి చేరవని  సీపీ నాగరాజు అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ తీశారు.

Published : 30 Sep 2022 03:21 IST

ర్యాలీ ప్రారంభిస్తున్న సీపీ నాగరాజు

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: రోజు 40 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేస్తే గుండెజబ్బులు దరి చేరవని  సీపీ నాగరాజు అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ తీశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో ఉన్నవారు కూడా గుండెజబ్బు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మానసిక ఒత్తిడిని జయించడానికి ప్రయత్నించాలన్నారు. ఎల్లమ్మగుట్ట నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్‌ మైదానానికి చేరుకొంది. వైద్యులు రవికిరణ్‌, సందీప్‌, అవీన్‌, విద్యాసాగర్‌, శ్రీనివాస్‌, వాసు, కళ్యాణ్‌, శ్రీనివాస్‌శర్మ, స్వామి పాల్గొన్నారు.

న్యూరో సైకియాట్రిక్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలోనూ గుండె సంబంధిత సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండెవైద్య నిపుణుడు గోపీకృష్ణ, రోటరీక్లబ్‌ అధ్యక్షుడు సతీష్‌సాహ, ప్రధాన కార్యదర్శి విశాల్‌, సుధీర్‌ గుప్తా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని