logo

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత కుమారులదే

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ కుమారులదేనని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ భవనంలో శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు.

Published : 02 Oct 2022 04:51 IST


పున్న రాజేశ్వర్‌ను సన్మానిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ కుమారులదేనని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ భవనంలో శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు వృద్ధులతో గౌరవంగా మెలగాలన్నారు. పలువురు వయోవృద్ధులను సన్మానించారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు పున్న రాజేశ్వర్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్మన్‌ రాజన్న, ప్రతినిధులు భద్రయ్య, కౌన్సిలర్లు లత, అపర్ణ, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమాధికారిణి రమ్య, బాలల సంరక్షణ అధికారిణి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని