logo

వడ్డీ మాఫీకి చక్కటి స్పందన

ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ పథకానికి చక్కటి స్పందన లభించింది. లక్ష్యానికి మించి పన్ను వసూలైంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది విస్తృత ప్రచారం చేయడంతో ఆశించిన ఫలితాలొచ్చాయి.

Published : 02 Oct 2022 04:51 IST

ఆస్తిపన్ను లక్ష్యానికి మించి వసూలు
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం


కామారెడ్డిలో మజీద్‌ కాంప్లెక్స్‌ పన్ను రూ.1.90 లక్షలు చెల్లిస్తున్న ప్రతినిధులు

ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ పథకానికి చక్కటి స్పందన లభించింది. లక్ష్యానికి మించి పన్ను వసూలైంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది విస్తృత ప్రచారం చేయడంతో ఆశించిన ఫలితాలొచ్చాయి. భారీగా బకాయిపడిన యజమానులకు పలుమార్లు తాఖీదులు జారీ చేశారు. తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించారు. పురపాలక శాఖ నుంచి నిత్యం బల్దియాల నుంచి ఎంత పన్ను వసూలైందో నివేదికలు తెప్పించుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి భారీగా ఆదాయం రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 5శాతం వడ్డీ మాఫీకి స్పందన వచ్చింది. ముందస్తు చెల్లింపులతో రూ.కోటి మేర ఆదాయం సమకూరింది. 90 శాతం వడ్డీ మాఫీతో పురపాలికల ఖజానాకు కాసులు సమకూరాయని కామారెడ్డి బల్దియా ఆర్‌ఐ జానయ్య పేర్కొన్నారు. మిగతావారు సైతం సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని