logo

బకాయిల వసూలుకు నెలన్నర గడువు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(ఎన్డీసీసీబీ)లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుకు(ఎన్‌పీఏ) మరో నెలన్నర రోజులు గడువు ఇవ్వడానికి పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.

Published : 02 Oct 2022 04:51 IST


ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలకవర్గ సభ్యులు

నిజామాబాద్‌ వ్యవసాయం : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(ఎన్డీసీసీబీ)లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుకు(ఎన్‌పీఏ) మరో నెలన్నర రోజులు గడువు ఇవ్వడానికి పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్‌ 15లోగా పూర్తిస్థాయిలో ఎన్‌పీఏలను వసూలు చేయాలని ఆదేశించారు. నాబార్డు ఆదేశాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో రూ.25 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.20 లక్షల వరకు రుణాలివ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు రూ.20 లక్షలు ఇవ్వనున్నారు. అనంతరం సిబ్బంది బదిలీలపై చర్చించారు. నవంబర్‌ 19 నాటికి డీసీసీబీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సంబరాల నిర్వహణపై మరోసారి సమావేశం కావాలని భావించారు. వైస్‌ ఛైర్మన్‌ రమేశ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, లింగన్న, బోర్డు సభ్యులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని