logo

రెండు గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద పెరగడంతో రెండు వరద గేట్ల ద్వారా మంజీరలోకి విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఏఈఈ శివప్రసాద్‌ తెలిపారు.

Published : 02 Oct 2022 04:51 IST


మంజీరలోకి విడుదలవుతున్న మిగులు జలాలు

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద పెరగడంతో రెండు వరద గేట్ల ద్వారా మంజీరలోకి విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఏఈఈ శివప్రసాద్‌ తెలిపారు. శనివారం సాయంత్రం సాగర్‌లోకి 9805 క్యూసెక్కుల వరద  వచ్చి చేరిందని, రెండు గేట్ల నుంచి 8 వేల క్యూసెక్కులు మంజీరలోకి, జలవిద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 1805 క్యూసెక్కులు నిజాంసాగర్‌ ప్రధాన కాలువలోకి  విడుదల చేసినట్లు చెప్పారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404 అడుగుల (17.687 టీఎంసీలు) నీరు ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని