logo

జ్వరాలతో మంచానపడ్డారు

బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రి పిల్లల వార్డులో 25 పడకలు ఉండగా శుక్రవారం 64 , శనివారం 58 మంది చిన్నారులు అడ్మిట్‌ అయ్యారు. సాధారణంగా రోజూ 50 నుంచి 80 వరకు ఓపీ ఉంటుంది.

Published : 03 Oct 2022 03:41 IST

పిల్లలతో ఆసుపత్రులు కిటకిట
న్యూస్‌టుడే, బాన్సువాడ

బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్నారుల వైద్యానికి క్యూ

బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రి పిల్లల వార్డులో 25 పడకలు ఉండగా శుక్రవారం 64 , శనివారం 58 మంది చిన్నారులు అడ్మిట్‌ అయ్యారు. సాధారణంగా రోజూ 50 నుంచి 80 వరకు ఓపీ ఉంటుంది. కొన్ని రోజులుగా నిత్యం 250 మంది  చిన్నపిల్లలు వస్తున్నారు.

పట్టణంలోని చైతన్యకాలనీలో ఒకరికి డెంగీ సోకింది. బాన్సువాడ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స అనంతరం నిజామాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స చేయించుకుని సుమారు రూ.లక్షకు పైగా వెచ్చించి ఇంటికి ఆరోగ్యంగా రావాల్సిన పరిస్థితి. శ్రీరామకాలనీకి చెందిన మరొకరికి డెంగీ సోకింది. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. అక్కడ సుమారు రూ.2లక్షలు వెచ్చించి అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కేసులు బాన్సువాడలో ఇటీవల పదుల సంఖ్యలో వచ్చాయి.

విష జ్వరాలు విజృంభించి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో అపరిశుభ్రం పెరిగి  దోమలు వృద్ధి చెందుతున్నాయి. వరుస లీకేజీలతో కలుషిత నీరు తాగి డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర రోగాల బారిన పడుతున్నారు. రోగ నిరోధశక్తి తక్కువగా ఉన్న వారు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బెడ్లు నిండాయి.

బల్దియా అధికారులు దోమల నియంత్రణ, మురుగుకాలువల్లో మురుగు తొలగింపు తదితర కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై విషజ్వరాలు తగ్గే వరకు శిబిరాలు నిర్వహించి ప్రజలు ఆసుపత్రులపాలు కాకుండా చర్యలు తీసుకోవాలి.

మంచాలు సరిపోవడం లేదు
శ్రీనివాస్‌ ప్రసాద్‌, బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకుడు

జ్వర పీడిత చిన్నారులు ప్రతి రోజు 200 మందికి తగ్గకుండా వస్తున్నారు. ఒక్కో రోజు ఆ సంఖ్య 350కు చేరుతుంది. మంచాలు సరిపోని పరిస్థితి ఉంది. వచ్చిన వారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. ఇప్పటి వరకు ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని