logo

అన్నదాతలకు అన్యాయం

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టతలేని నిర్ణయాలు, విధానాలతో రైతులు అయోమయంలో ఉన్నారని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ)లోని తన స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 03 Oct 2022 03:41 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి అస్పష్ట విధానాలు
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టతలేని నిర్ణయాలు, విధానాలతో రైతులు అయోమయంలో ఉన్నారని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ)లోని తన స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. గతేడాది సేకరించిన ధాన్యంలో సుమారు 72 లక్షల మె.ట. ధాన్యం మిల్లర్ల వద్ద ఉందని.. ఈ ఖరీఫ్‌లో కొనుగోలు చేసే ధాన్యంతో కలిపి 170 మె.ట. చేరుకుంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు అస్పష్టతతో అన్నదాతల నడ్డివిరిచేలా ఉన్నాయన్నారు. బియ్యంలో నూక శాతం, నష్టం భర్తీ అంశంపై మిల్లర్లకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపణ చేస్తోందన్నారు. జిల్లాలో అన్ని ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉందని యాసంగి పంటకు జిల్లా యంత్రాంగం వెంటనే షెడ్యూల్‌ తయారు చేయాలని మండవ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని