logo

చెరువును చేరని చేప

మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం వందశాతం రాయితీతో చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తోంది. జిల్లాలోని 1043 చెరువుల్లో వేయడానికి 4.85 కోట్ల పిల్లలు అవసరమని అంచనా వేశారు. వీటి సేకరణకు జులైలోనే టెండర్లు పూర్తయ్యాయి. ఇద్దరు గుత్తేదార్లు విత్తన చేపను సరఫరా చేయాల్సి ఉన్నా జాప్యం నెలకొంటుంది. ఇప్పటికీ 3 లక్షలు మాత్రమే వారు అందించారు.

Published : 03 Oct 2022 03:41 IST

ఈనాడు, నిజామాబాద్‌

త్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం వందశాతం రాయితీతో చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తోంది. జిల్లాలోని 1043 చెరువుల్లో వేయడానికి 4.85 కోట్ల పిల్లలు అవసరమని అంచనా వేశారు. వీటి సేకరణకు జులైలోనే టెండర్లు పూర్తయ్యాయి. ఇద్దరు గుత్తేదార్లు విత్తన చేపను సరఫరా చేయాల్సి ఉన్నా జాప్యం నెలకొంటుంది. ఇప్పటికీ 3 లక్షలు మాత్రమే వారు అందించారు. మత్స్యశాఖ పెంచిన 53 లక్షలతో పాటు వీటిని కూడా చెరువుల్లో వేశారు.

చెరువులో వదిలేందుకు 35-40 ఎంఎం, 80-100 ఎంఎం పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను యంత్రాంగం ముందస్తుగానే టెండర్లు నిర్వహించింది. మూడు కంపెనీలు పాల్గొనగా కోడ్‌ చేసిన ధర ఆధారంగా నవీపేటకు చెందిన ఇద్దరు గుత్తేదార్లను ఎంపిక చేశారు. నిర్దేశిత లక్ష్యం 4.85 కోట్ల పిల్లలకుగాను పోచంపాడ్‌ ప్రాజెక్టు వద్ద మత్స్యశాఖ కోటి వరకు పెంచుతున్నాయి. మిగతా 3.85 కోట్లు గుత్తేదార్లు అందించాలి.

పర్యవేక్షణ అవసరం..
విత్తన నాణ్యత లోపిస్తే చేప పెరగని పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఒకసారి ఇలాగే జరగడంతో అరకేజీ కూడా బరువు పెరగలేదు. నాణ్యమైన పిల్లల పంపిణీ జరిగేలా చూడాల్సిన బాధ్యత మత్స్యశాఖపై ఉంది. జిల్లాలోని వాతావరణానికి అలవాటుపడిన రకాలు ఇవ్వాలి. ఈ విషయంపై మత్స్యశాఖ అధికారి మాట్లాడుతూ.. సీడ్‌ ఫామ్‌ల వద్దకు వాహనాలు వెళ్లలేకపోవడంతో జాప్యం జరిగిందని గుత్తేదార్లు చెప్పారు. సోమవారం నుంచి సరఫరాను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఎస్సారెస్పీ వద్ద..
చేపపిల్లలను బయటి నుంచి కొనుగోలు చేసి ఇవ్వటం ఖర్చుతో కూడుకున్న అంశమే. అందులోనూ నాణ్యమైనవి అందించటం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎస్సారెస్పీ వద్ద చేపపిల్లలను ఉత్పత్తి చేసే బ్రూడ్‌బ్యాంకు విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విత్తనం అందుబాటులోకి రావటానికి రెండేళ్లు పడుతుంది. ్చ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని