logo

దసరా తర్వాతే రేషన్‌ బియ్యం

జిల్లాలోని రేషన్‌ దుకాణాల ద్వారా దసరా తర్వాత బియ్యం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఇవ్వనున్నారు. అయితే ‘కేంద్రం మరో మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తామన్నా.. అదనంగా ఐదు కిలోల బియ్యంపై అధికారిక ఉత్తర్వులు రావాలని’ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్‌ తెలిపారు.

Published : 03 Oct 2022 03:41 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని రేషన్‌ దుకాణాల ద్వారా దసరా తర్వాత బియ్యం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఇవ్వనున్నారు. అయితే ‘కేంద్రం మరో మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తామన్నా.. అదనంగా ఐదు కిలోల బియ్యంపై అధికారిక ఉత్తర్వులు రావాలని’ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్‌ తెలిపారు.

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా పేదలను ఆదుకోవడానికి రేషన్‌ దుకాణాల్లో ఉచిత బియ్యం ఇవ్వడం ప్రారంభించింది. సెప్టెంబర్‌ వరకు గడువు ముగియడంతో మరో మూడు నెలలు పొడిగించారు. అందుకు సంబంధించి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

అర్బన్‌లో ఆలస్యంగా..
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని దుకాణాలకు గోదాంల నుంచి బియ్యాన్ని చేరవేశారు. ఆయా చోట్ల పండుగ తర్వాత పంపిణీ చేయనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌లో 87 దుకాణాలు ఉండగా ఇక్కడ మరింత ఆలస్యం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని