logo

కాపాడేందుకా.. కాలరాసేందుకా..!

ఇందల్‌వాయి-ధర్పల్లి రహదారి గుంతల నిలయంగా మారి అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. ఎల్లారెడ్డిపల్లి శివారులో ఈ చిత్రం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. నడిరోడ్డులో పెద్దగుంత ఉందనే హెచ్చరికతో అక్కడ డ్రమ్ము పెట్టారు. కానీ గుంత కంటే డ్రమ్మే ప్రమాదకరంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

Published : 03 Oct 2022 03:41 IST

ఎల్లారెడ్డిపల్లి వద్ద గుంత ఉందని నడిరోడ్డులో డ్రమ్ము అడ్డుగా పెట్టిన దృశ్యం

న్యూస్‌టుడే, ఇందల్‌వాయి: ఇందల్‌వాయి-ధర్పల్లి రహదారి గుంతల నిలయంగా మారి అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. ఎల్లారెడ్డిపల్లి శివారులో ఈ చిత్రం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. నడిరోడ్డులో పెద్దగుంత ఉందనే హెచ్చరికతో అక్కడ డ్రమ్ము పెట్టారు. కానీ గుంత కంటే డ్రమ్మే ప్రమాదకరంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. వేగంగా వచ్చే వాహనదారులు డ్రమ్ము గమనించకపోతే వాహనం బోల్తాపడి ప్రమాదతీవ్రత పెరుగుతుందనే కనీస అవగాహన లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు కాపాడేందుకు ఇలా చేశారా.. జీవితాలను కాలరాసేందుకు చేశారా అంటూ ఆవేదన వ్యక్తం చేసున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని