logo

బాపూ బాటలో నడవాలి : గోవర్ధన్‌

అందరూ జాతిపిత బాపూజీ చూపిన శాంతియుత బాటలో నడవాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన గాంధీజీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి విప్‌ పాల్గొన్నారు.

Published : 03 Oct 2022 03:41 IST

కామారెడ్డి అర్బన్‌, కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అందరూ జాతిపిత బాపూజీ చూపిన శాంతియుత బాటలో నడవాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన గాంధీజీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి విప్‌ పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పున్న రాజేశ్వర్‌, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, ఏఎంసీ ఛైర్మన్‌ పిప్పిరి వెంకటి, వైస్‌ ఛైర్మన్‌ రవికుమార్‌యాదవ్‌, తెరాస పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్పీ అన్యోన్య, కలెక్టరేట్‌లో పాలనాధికారి పాటిల్‌ నివాళులర్పించారు. డీసీవో వసంత, జిల్లా కార్మికశాఖ అధికారి సురేందర్‌కుమార్‌, పర్యవేక్షకులు సాయిభుజంగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రత ప్రచారరథం ప్రారంభం
కామారెడ్డి కలెక్టరేట్‌: గాంధీ జయంతి సందర్భంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌, జిల్లా స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిశుభ్రత ప్రచారరథాన్ని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ వాహనం ఇంటింటా ఇంకుడు గుంతలు, చెత్త సేకరణ, కంపోస్ట్‌ ఎరువుల తయారీ వంటి విషయాలపై అవగాహన పెంచుతుందని తెలిపారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ జిల్లా మేనేజర్‌ పులగం రాజు, స్వచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా మేనేజర్‌ నారాయణ, జిల్లా సాంస్కృతిక కళాసారథి కళాకారులు రమేశ్‌రావు, ఆకుల మహేందర్‌, విఠల్‌రెడ్డి, రాము, సమత, పోశెట్టి, లక్ష్మీనారాయణ, నరేశ్‌, వినాయక్‌, సలావుద్దీన్‌, తిరుపతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని