logo

తహసీల్దార్లతో తనిఖీ బృందాల ఏర్పాటు

రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్‌ తెలిపారు.

Published : 05 Oct 2022 03:37 IST

బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు
ముఖాముఖిలో డీసీఎస్‌వో చంద్రప్రకాశ్‌
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్‌ తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్‌ నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంటు బృందాలను పటిష్ఠం చేస్తామన్నారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. 

88 కేసులు నమోదు
రేషన్‌ దుకాణాల నుంచి తీసుకుంటున్న బియ్యాన్ని చాలా మంది అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అలా అమ్మినా.. కొన్నా.. చట్ట ప్రకారం నేరం. ఇటీవల బియ్యాన్ని అధికంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. నగరంతో పాటు గ్రామాల్లోనూ నిఘా ఉంచుతున్నాం. 88 కేసులు నమోదు చేశాం. ఎవరి ఇంట్లోనైనా నిల్వలు ఉన్నట్లు గుర్తిస్తే తహసీల్‌ కార్యాయంలో ఫిర్యాదు చేయాలి. ఇందులో డీలర్లనూ వదిలే ప్రసక్తి లేదు. ఎన్‌ఫోర్స్‌మెంటు డిప్యూటీ తహసీల్దార్లతో దుకాణాలు తనిఖీ చేయిస్తాం. ఖాళీగా ఉన్న డీలర్ల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

458 కేంద్రాలు..
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. సహకార సంఘాలు, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో 458 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. జిల్లాలో 305 రైస్‌మిల్లుల్లో లక్ష మె.ట ధాన్యం నిల్వ చేసే వీలుంది. యాసంగికి చెందిన సీఎంఆర్‌ను తీసుకుంటున్నాం. ఇంకా 128 లక్షల మె.ట సీఎంఆర్‌ రావాల్సి ఉంది.

పెట్రోల్‌ బంకుల్లోనూ..
పెట్రోల్‌ బంకు, గ్యాస్‌ గోదాంల్లో ఇటీవల తనిఖీలు చేయని విషయం వాస్తవమే. బంకుల్లో సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నట్లు తేలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. వాహనదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. గ్యాస్‌ సిలిండర్లను పక్కదారి పట్టించొద్దు. వ్యాపారులు వాణిజ్య సిలిండర్లు మాత్రమే వాడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు