logo

సంరక్షిస్తేనే వన్యప్రాణుల మనుగడ

ప్రతి ఒక్కరు వన్యప్రాణులను సంరక్షించాలని.. అప్పుడే వాటి సంఖ్య పెరిగి మనుగడ సాగిస్తాయని అటవీ ముఖ్య సంరక్షణాధికారి శర్వాణన్‌ పేర్కొన్నారు.

Published : 05 Oct 2022 03:37 IST


చిన్నాపూర్‌ అర్బన్‌ పార్క్‌లో 3కే రన్‌లో పాల్గొన్న సీసీఎఫ్‌ అధికారి శర్వాణన్‌

మాక్లూర్‌ గ్రామీణం : ప్రతి ఒక్కరు వన్యప్రాణులను సంరక్షించాలని.. అప్పుడే వాటి సంఖ్య పెరిగి మనుగడ సాగిస్తాయని అటవీ ముఖ్య సంరక్షణాధికారి శర్వాణన్‌ పేర్కొన్నారు. మాక్లూర్‌ మండలం చిన్నాపూర్‌ సమీపంలోని అర్బన్‌ పార్క్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మంగళవారం 3కే పరుగు ప్రారంభించారు. వాకింగ్‌ ట్రాక్‌పై పరిగెత్తారు. రోడ్డుపై వెళ్లే సమయంలో చాలా జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయని, చోదకులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవోలు రాంకిషన్‌, భవానీ శంకర్‌, సుధాకర్‌, సౌమ్య, సుశీల్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని