logo

ఉత్సవాలకు ముస్తాబైన దోమకొండ బురుజు

దోమకొండ బురుజు కోటను దసరా ఉత్సవాలకు ముస్తాబు చేశారు. శుద్ధి చేసి విద్యుద్దీపాలను అలంకరించారు.

Published : 05 Oct 2022 03:37 IST

న్యూస్‌టుడే, దోమకొండ  : దోమకొండ బురుజు కోటను దసరా ఉత్సవాలకు ముస్తాబు చేశారు. శుద్ధి చేసి విద్యుద్దీపాలను అలంకరించారు. ఇక్కడ నిజాంకాలం నుంచే దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నాటి పాలనలో ఇబ్బందులు పడ్డ దోమకొండ వాసులు స్వాతంత్య్రం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇక్కడ మువ్వన్నెల జెండా ఎగురవేయడానికి నిజాం పాలకులకు భయపడేవారు. 1947 సెప్టెంబరు 8న కొందరు యువకులు రహస్యంగా 23 అడుగుల పొడవు, 46 అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేసి దోమకొండ బురుజుపై ఎగురవేశారు. అప్పటి నుంచి ప్రతి దసరా రోజున జెండా ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని