logo

ప్రధాన దారి.. దుమ్ము రేగి

సుమారు కిలోమీటరు దూరం ఉండే దారి వెంట ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. లేదంటే దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఇదెక్కడో మారుమూల పల్లెలో కాదు.

Published : 05 Oct 2022 03:37 IST


జిల్లాకేంద్రం రైల్వేస్టేషన్‌ రోడ్డులో ముక్కు మూసుకొని వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు, పాదచారులు

సుమారు కిలోమీటరు దూరం ఉండే దారి వెంట ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. లేదంటే దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఇదెక్కడో మారుమూల పల్లెలో కాదు. జిల్లా కేంద్రంలోని కోర్టు రోడ్డు దుర్గతి ఇది. తహసీల్దారు, జడ్పీ, ఆర్డీవో కార్యాలయాలతో పాటు జిల్లా కోర్టు ఈ మార్గంలోనే ఉండటం గమనార్హం. గతంలో పెద్దఎత్తున గుంతలతో ఈ రహదారిపై ప్రయాణమంటేనే గుబులు పుట్టించే స్థితిలో ఉండేది. కొన్నాళ్ల క్రితం వాటిని పూడ్చి కంకర వేసి చదును చేసి కంకరపొడి పోశారు. రైల్వేస్టేషన్‌కు గూడ్స్‌ రైళ్లలో వచ్చే ఎరువులు, ధాన్యం, ఇతర సరకులను ఇక్కడే లారీల్లోకి ఎక్కిస్తారు. ఎడతెగని వాహనాల రాకపోకలతో ఈ రోడ్డంతా దుమ్ము రేగుతోంది. స్థానికులతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా తారు వేసి దుమ్ము లేవకుండా నిలువరించాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని