logo

గజ్జెలు ఘల్లు.. గ్రామాల్లో సందళ్లు

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ప్రాచీన  జానపద కళారూపమైన జడ కొప్పు కోలాటాల సందడి నెలకొంది.

Published : 05 Oct 2022 03:37 IST


మాచారెడ్డిలో జడకొప్పు కోలాటం ఆడుతున్న కళాకారులు

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ప్రాచీన  జానపద కళారూపమైన జడ కొప్పు కోలాటాల సందడి నెలకొంది. పాడి పంటలు బాగుండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ దీనిని ఆడతామని కళాకారులు చెబుతున్నారు. మంగళవారం మాచారెడ్డిలో 32 మంది కాళ్లకు గజ్జెలు కట్టుకొని గుండ్రంగా తిరుగుతూ.. రాధాకృష్ణుల మధ్య జరిగే సంభాషణలను పాటలుగా పాడుతూ కోలాలు ఆడారు. నృత్యం చేస్తూ జడకొప్పు అల్లి తర్వాత విప్పారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రదర్శన తిలకించారు.

- న్యూస్‌టుడే, మాచారెడ్డి

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని