logo

Super Star Krishna: ఇందూరుతో అనుబంధం

సాహసమే తన ఊపిరిగా తెలుగు సినీరంగంలో తనదైన ముద్రవేసిన సూపర్‌స్టార్‌ కృష్ణకు ఇందూరుతో అనుబంధం ఉంది. ఆయన నటించిన సినిమాలకు జిల్లావాసులు నిర్మాతలుగా వ్యవహరించారు.

Updated : 16 Nov 2022 10:23 IST

1989లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన

నవీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి హాజరైన సినీ నటుడు కృష్ణ

నిజామాబాద్‌ సాంస్కృతికం, నవీపేట, న్యూస్‌టుడే: సాహసమే తన ఊపిరిగా తెలుగు సినీరంగంలో తనదైన ముద్రవేసిన సూపర్‌స్టార్‌ కృష్ణకు ఇందూరుతో అనుబంధం ఉంది. ఆయన నటించిన సినిమాలకు జిల్లావాసులు నిర్మాతలుగా వ్యవహరించారు. 1970లో విడుదలైన పచ్చని సంసారం చిత్రాన్ని జిల్లా కేంద్రానికి చెందిన గంజుల నారాయణ నిర్మించారు. కేఎస్‌ఆర్‌ దాస్‌ దర్శకత్వం వహించిన జేమ్స్‌బాండ్‌ 777కు కూడా నిజామాబాద్‌కు చెందిన బిక్కులాల్‌ అగర్వాల్‌ నిర్మాతగా ఉన్నారు. మాస్టర్‌ కిలాడి సినిమాకు సహ నిర్మాతగా అగర్వాల్‌ వ్యవహరించారు. 1989లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలాగౌడ్‌కు మద్దతుగా ఆయన నవీపేట, రెంజల్‌, బోధన్‌, వర్ని, బాన్సువాడలో పర్యటించినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నవీపేటకు చెందిన రాజ్‌కుమార్‌ కృష్ణకు వీరాభిమాని. అప్పటి ఎన్నికల ప్రచారంలో మండల కేంద్రానికి వచ్చిన ఆయనతో తీసుకున్న చిత్రాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు.

* కృష్ణ మృతి తీరని లోటని క్లాసిక్‌ సినిమా క్లబ్‌ ప్రతినిధులు చంద్రసేన్‌రెడ్డి, మేక రామస్వామి, వీపీ చందన్‌రావు, శ్రీపాద కుమారశర్మ, తెలుగు వెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, రాంబత్రి గంగాధర్‌, శంకర్‌ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని