logo

పాస్‌పోర్టులో ఇంటిపేరు తప్పనిసరి

గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి ఇకపై పాస్‌పోర్టు ఉంటే సరిపోదు. అందులో ఇంటి పేరుతో సహా పక్కాగా ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఇంటిపేరు లేకుంటే వీసా ఉన్నా ఇమిగ్రేషన్‌ పూర్తికాదు.

Published : 26 Nov 2022 05:03 IST

కొత్త నిబంధన అమలు చేసిన యూఏఈ

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ: గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి ఇకపై పాస్‌పోర్టు ఉంటే సరిపోదు. అందులో ఇంటి పేరుతో సహా పక్కాగా ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఇంటిపేరు లేకుంటే వీసా ఉన్నా ఇమిగ్రేషన్‌ పూర్తికాదు. కంపెనీ, సందర్శక వీసాలపై వెళ్లేవారందరికీ కూడా ఈ నిబంధన వర్తించనుంది. ఈ మేరకు దేశంలోని పలు విమానయాన సంస్థలు సైతం తమ ఏజెంట్లకు నూతన మార్గదర్శకాలను జారీ చేశాయి.

* ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాల్లో 4 లక్షలు పైబడి వలస కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ రంగం, హోటళ్లు, విమానాశ్రయాలు, పరిశ్రమల్లో వీరంతా పని చేస్తున్నారు. కొందరు ఏళ్లుగా అక్కడే ఉండిపోయారు. చాలా మంది పాస్‌పోర్టుల్లో ఇంటిపేర్లు లేవు. కొందరికి ఇంటిపేరుకు బదులుగా కేవలం మొదటి అక్షరం మాత్రమే ఉంది. వీరందరికి భవిష్యత్తులో చిక్కులు తప్పవని తెలుస్తోంది.

* యూఏఈలోని నేషనల్‌ అడ్వాన్స్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ సూచనల మేరకు ప్రస్తుతానికి యూఈఏ నూతన నిబంధనలు విధించింది. ఇక్కడ జిల్లాకు చెందిన వారు లక్ష మంది ఉంటారని సమాచారం. ఇప్పటినుంచి యూఏఈ వెళ్లాలనుకొనే వారి పాస్‌పోర్టులు తాజా నిబంధనల ప్రకారం ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని