logo

ఓటు హక్కు నమోదుకు అవకాశం : కలెక్టర్‌

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఈ నెల 26, 27, డిసెంబర్‌ 3, 4వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు.

Published : 26 Nov 2022 05:03 IST

రుణాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరిస్తున్న పాలనాధికారి నారాయణరెడ్డి, బ్యాంకు అధికారులు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఈ నెల 26, 27, డిసెంబర్‌ 3, 4వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. బీఎల్‌వోలు పోలింగ్‌ కేంద్రంలో అందుబాటులో ఉండాలన్నారు. దాంతో పాటు ఓటుకు ఆధార్‌ అనుసంధానంపై దృష్టి సారించాలని చెప్పారు. అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు పాలనాధికారులు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, డీపీవో జయసుధ, డీసీవో సింహాచలం, జడ్పీ సీఈవో గోవింద్‌, డీఆర్‌డీవో చందర్‌ ఉన్నారు.

రుణాలపై సమీక్ష..

నిజామాబాద్‌ కలెక్టరేట్‌: రైతులకు నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ‘బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ’ సమావేశం నిర్వహించారు. వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి బ్యాంకుల వారీగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.2,308 కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉండగా రూ.1,664.45 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రుణాల రికవరీలో ఎలాంటి ఆందోళన చెందవద్దని.. జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తుందన్నారు. వీధి వ్యాపారులకు ముద్ర రుణాలు ఇవ్వాలని దీనికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని మెప్మా అధికారులను ఆదేశించారు. స్వయం ఉపాధి కోర్సుల్లో గ్రామీణ యువతకు ఎస్‌బీఐ శిక్షణ ఇవ్వడంతో వారిని అభినందించారు. ఆర్‌బీఐ ప్రతినిధి వైభవ్‌ వ్యాస్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని