logo

నాగన్న దిగుడు బావి పరిశీలన

లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న దిగుడుబావిని శనివారం జిల్లా పాలనాధికారి జితేశ్‌ వి.పాటిల్‌, ప్రైవేటు ఏజెన్సీ ఆర్కిటెక్ట్‌ కల్పన, ఇన్ఫోసిస్ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీషా పరిశీలించారు.

Updated : 26 Nov 2022 17:24 IST

లింగంపేట: లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న దిగుడుబావిని శనివారం జిల్లా పాలనాధికారి జితేశ్‌ వి.పాటిల్‌, ప్రైవేటు ఏజెన్సీ ఆర్కిటెక్ట్‌ కల్పన, ఇన్ఫోసిస్ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీషా పరిశీలించారు. నాగన్నబావిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. లింగంపేట మండలంలోని ముంబోజిపేట తండాలో గిరిజన జీవన విధానాన్ని, బీర్కూర్‌ మండలంలోని తిరుమల ఆలయాన్ని పరిశీలించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మారుతి, ఎంపీడీవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని