logo

నిధులొచ్చాయ్‌

ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా ఆయుష్‌ ఆసుపత్రులను హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Published : 27 Nov 2022 06:09 IST

16 యోగా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

తుది దశకు చేరుకున్న యోగా కేంద్రం నిర్మాణం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం: ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా ఆయుష్‌ ఆసుపత్రులను హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని నిజామాబాద్‌ జిల్లాలోని 17కి గాను 16 ఆయుష్‌ దవాఖానాల్లో యోగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

* ఒక్కో దానికి రూ.6 లక్షలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్మాణ పనులు చేపడుతున్నాయి. ఆరు నెలల క్రితం ఒక్కో యోగా కేంద్రానికి రూ.6 లక్షల నిధులు మంజూరు చేశారు. వాటిలో డిచ్‌పల్లి, ధర్పల్లి, నందిపేట్‌, కుద్వాన్‌పూర్‌, పడకల్‌, మోర్తాడ్‌, వేల్పూర్‌, ఎడపల్లి, నవీపేట్‌, పోతగల్‌, నిజామాబాద్‌ అర్బన్‌లో(రెండు), బోధన్‌, బడాభీంగల్‌, మాక్లూర్‌, మోస్రా ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆయుర్వేద, హోమియో, యునానీ సేవలందిస్తున్నారు.
* యోగా మాస్టర్‌ నియామకం: ఈ కేంద్రాలు ప్రారంభించిన తర్వాత ప్రతి దాంట్లో ఓ యోగా మాస్టర్‌ను నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. వీరు ఏ వ్యాధికి ఏ రకమైన యోగా చేయాలి, ఆహార నియమాలు తదితర వ్యాయామాల్లో శిక్షణ ఇస్తారు.
*   పనులు వేగవంతం: నిజామాబాద్‌, డిచ్‌పల్లి, నందిపేట్‌, కుద్వాన్‌పూర్‌ ప్రాంతాల్లో 90 శాతం, మిగిలిన వాటిలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. మోర్తాడ్‌, ఎడపల్లి, నవిపేట్‌, బోధన్‌లలో మాత్రం ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
త్వరలో ప్రారంభిస్తాం

డాక్టర్‌ రమణ మోహన్‌, ఆయుష్‌ ఇన్‌ఛార్జి

ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం యోగా కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించింది. పనులు పూర్తయిన నాలుగు కేంద్రాల్లో త్వరలోనే సేవలు ప్రారంభిస్తాం. మిగిలిన వాటిలో పనులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని