logo

గద్దెలు కూల్చేశారని.. రహదారి దిగ్బంధం

మండల కేంద్రంలో నిర్మించుకున్న సేవాలాల్‌, జగదాంబ దేవతలకు సంబంధించిన జెండా గద్దెలను కొందరు వ్యక్తులు కూల్చేశారని బంజారా నాయకులు పేర్కొన్నారు.

Published : 27 Nov 2022 06:09 IST

రోడ్డుపై బైఠాయించిన బంజారా నాయకులు

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో నిర్మించుకున్న సేవాలాల్‌, జగదాంబ దేవతలకు సంబంధించిన జెండా గద్దెలను కొందరు వ్యక్తులు కూల్చేశారని బంజారా నాయకులు పేర్కొన్నారు. శనివారం దాదాపు నాలుగు గంటల పాటు రహదారిని దిగ్బంధించారు. ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరినాయక్‌ వారికి మద్దతు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసి తహసీల్దార్‌ రోజా ఎదుట బైండోవర్‌ చేశామని, మళ్లీ ఇలా నిరసనకు దిగడం తగదని ఎస్సై నరేశ్‌, సీఐ నరేశ్‌ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధర్పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను రాంపూర్‌ మీదుగా, అటుగా వెళ్లే వాటిని గన్నారం మీదుగా దారి మళ్లించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం ఇరువర్గాలతో మాట్లాడి శాంతియుతంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో శాంతించారు. ఆందోళనలో ఏఐబీఎస్‌ఎస్‌ సంఘం మండలాధ్యక్షుడు తుకారంరాఠోడ్‌, మోహన్‌నాయక్‌, రాజునాయక్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని