logo

వెలుగులోకి వీరుల త్యాగాలు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌(సీసీఆర్టీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ డిస్ట్రిక్ట్‌ రిపోజిటరీ(డీడీఆర్‌) ప్రాజెక్టు చేపట్టింది.

Published : 27 Nov 2022 06:09 IST

సీసీఆర్టీ ఆధ్వర్యంలో వివరాల సేకరణ

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌(సీసీఆర్టీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ డిస్ట్రిక్ట్‌ రిపోజిటరీ(డీడీఆర్‌) ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి జిల్లాకు చెందిన వ్యక్తులు, సంఘటనలు, జీవన సంప్రదాయాలు, కళారూపాలు, దాచిన నిధులు, కోటలు, మ్యూజియాలు, సహజ వారసత్వాలపై ఫొటోలు, స్కెచ్‌, చిన్న నిడివి గల వీడియోలతో పాటు ఆంగ్లంలో కథనాలు ఆహ్వానిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రణాళిక, అమలు తీరుపై ప్రత్యేక కథనం.

కార్యాచరణ ఇలా..: రాష్ట్రాల వారీగా ఇద్దరు రిసోర్సు పర్సన్లను ఎంపిక చేసి మొత్తం 25 మంది ఉపాధ్యాయులకు అక్టోబరు 11-13వ తేదీల్లో దిల్లీలో కార్యశాల నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన గన్నారం ప్రభాకర్‌, సిద్దిపేటకు చెందిన రాజమల్లు శిక్షణ పొందారు. వీరిద్దరూ నవంబరు 11, 12వ తేదీల్లో హైదరాబాద్‌లోని సీసీఆర్టీ ప్రాంతీయ కేంద్రంలో 100 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వీరికి ఆయా జిల్లాలోని అంశాలను ఆంగ్లంలో డిజిçËలైజ్‌ చేసే బాధ్యతను అప్పగించారు.

* ప్రాజెక్టు విజయవంతం కోసం సీసీఆర్టీ స్కాలర్‌షిప్‌ హోల్డర్లు, యంగ్‌ స్కాలర్‌ ఆర్టిస్ట్‌లు, పూర్వ విద్యార్థులు, సీసీఆర్టీ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, జిల్లా రిసోర్స్‌ పర్సన్లతో పాటు ఆసక్తి కలిగిన వారెవరైనా భాగస్వాములు కావొచ్చు.
ఇవి తప్పనిసరి.. కథనాలు సేకరించే సమయంలో దానికి సంబంధించిన నిర్ధారణకు పలు సూచనలిచ్చారు. గ్యాలంటరీ అవార్డులు, ఒకటో, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అందుకున్న టెస్టిమోనియల్‌, ఐఎన్‌ఏలో పాల్గొనడం, రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు, 1972లో భారత ప్రభుత్వం ప్రదానం చేసిన తామ్రపత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపులను తప్పనిసరిగా పంచుకోవాలి.

* జిల్లా నుంచి డీడీఆర్‌ ప్రాజెక్టులో భాగంగా గతంలో ఒకే ఒక కథనం ప్రచురితమైంది. ఎం.నారాయణరెడ్డికి సంబంధించి.. 2020లో ఐఏఎస్‌ అధికారి మకరంద్‌ పొందుపర్చినట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలు.. 

సేకరించాల్సిన విషయం, స్వభావంపై సీసీఆర్టీ పలు మార్గదర్శకాలను రూపొందించింది. వ్యక్తులు, వ్యక్తిత్వాలు తదితర అంశాలపై ఆంగ్లంలో కథనాలు రాసి అనుబంధంగా చిత్రాలు/ఫొటోలు/చిన్న నిడివి కలిగిన వీడియోలతో డీడీఆర్‌ రూపొందించిన ప్రమాణపత్రాన్ని జత చేసి akam–ccrt@gov.in కు ఈ-మెయిల్‌, స్పీడ్‌ పోస్టులో పంపొచ్చు. భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి కథనం కనీసంగా 150 పదాలకు మించి ఉండాలి. కథ మూలాన్ని అందించడం తప్పనిసరి. ఇతర చోట్ల ప్రచురించిన కథనాలను అంగీకరించరు.

గుర్తింపుతో పాటు గౌరవ వేతనం

గన్నారం ప్రభాకర్‌, డీఆర్పీ, నిజామాబాద్‌

ఒక్కో కథనానికి గుర్తింపు ధ్రువపత్రంతో పాటు రూ.2 వేల గౌరవ వేతనం పొందవచ్చు. ఇప్పటివరకు పలువురు ఉపాధ్యాయులతో కలిసి 40 కథనాలు వెలికితీశాం. వివరాలకు 94406 59174 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని