logo

వేడినీళ్లు ఒంటిపై పడి చిన్నారికి తీవ్ర గాయాలు

ఫ్రెషర్‌ కుక్కర్‌లో వేడినీళ్లు చిన్నారి ఒంటిపై పడడంతో తీవ్ర గాయాలైన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.

Published : 27 Nov 2022 06:09 IST

అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన

 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి

ఎడపల్లి, న్యూస్‌టుడే: ఫ్రెషర్‌ కుక్కర్‌లో వేడినీళ్లు చిన్నారి ఒంటిపై పడడంతో తీవ్ర గాయాలైన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు కోడిగుడ్డు తింటున్న క్రమంలో ఆ పక్కనే పప్పు ఉడకబెట్టిన ఫ్రెషర్‌ కుక్కర్‌ ఒక్కసారిగా కిందపడడంతో అందులో మరుగుతున్న నీళ్లు అనూష(4)పై పడ్డాయి. దీంతో పక్కటెముల భాగం కాలింది. మిగతా విద్యార్థులు భయపడి బయటకు పరుగులు తీశారు. తల్లిదండ్రులు అంగన్‌వాడీ టీచరు నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని ఆందోళన చేశారు. గ్యాస్‌ పొయ్యి, కుక్కర్‌ కూడా బాగా లేకపోవడంతో ఇలా జరిగిందని మండిపడ్డారు. చిన్నారిని బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని