logo

భాజపా అభివృద్ధిలో పోటీ పడాలి

భాజపా నాయకులు, ఎంపీ అర్వింద్‌ మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బాల్కొండ, వేల్పూర్‌, భీమ్‌గల్‌లో మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Published : 30 Nov 2022 06:32 IST

మెండోరలో వంతెనను ప్రారంభిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

బాల్కొండ, వేల్పూర్‌, భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: భాజపా నాయకులు, ఎంపీ అర్వింద్‌ మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బాల్కొండ, వేల్పూర్‌, భీమ్‌గల్‌లో మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జలాల్‌పూర్‌లో రూ.68 లక్షలతో రోడ్డు పునరుద్ధరణ, కుల సంఘాల సామాజిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇటీవల గోనుగొప్పుల శివారులో బోగారపు వాగుపై రూ.2.60 కోట్లు, బెజ్జోర జక్లాత్‌పై రూ.2.35 కోట్లు, మెండోర వద్ద రూ.1.66 కోట్లతో నిర్మించిన వంతెనలను ప్రారంభించారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలని సవాల్‌ విసిరారు. ఎంపీ అర్వింద్‌ జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. దీక్షా దివస్‌ సందర్భంగా వేల్పూర్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్‌ తీరుతో తెలంగాణ సాధ్యం కాదని భావించిన విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు. దీనంతటికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆరే కారణమన్నారు. డీసీసీబీ వైస్‌ఛైర్మన్‌ రమేశ్‌రెడ్డి, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యుడు రవి, ఎంపీపీలు లావణ్య, ఆర్మూర్‌ మహేశ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌యాదవ్‌, ఎంపీటీసీ సభ్యురాలు లత, అరుణ, ప్రవీణ్‌రెడ్డి, నర్సయ్య, మోహిజ్‌, కల్పన పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని