జ్వరం ఉందని జిల్లాస్పత్రిలో ప్రసవానికి నిరాకరణ
ప్రసవం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి ఓ గర్భిణి రాగా ఆమెకు జ్వరం ఉందన్న చిన్నకారణంతో తమతో కాదని తిప్పి పంపించారు.
ప్రైవేటులో కవలలకు జన్మనిచ్చిన తల్లి
కామారెడ్డి వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ప్రసవం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి ఓ గర్భిణి రాగా ఆమెకు జ్వరం ఉందన్న చిన్నకారణంతో తమతో కాదని తిప్పి పంపించారు. పరిస్థితి విషమిస్తే గర్భంలో ఉన్న శిశువులకు ప్రమాదమని చెప్పి నిజామాబాద్ ఆసుపత్రికి సిఫారసు చేశారు. ఎలాగైనా వైద్యం చేయాలని బతిమిలాడినా నిరాకరించారని కుటుంబీకులు ఆరోపించారు. ఎంత సేపు వేచిచూసినా కనికరించకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా కవలలు(ఆడ) జన్మనిచ్చారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన రోజా ప్రవసం నిమిత్తం సోమవారం జిల్లా ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ చేసిన వైద్యులు కవలలు ఉన్నట్లు గుర్తించారు. గర్భిణికి జ్వరం ఉందని నిజామాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్లాలంటే కష్టమని ఇక్కడే ప్రసవం చేయాలని కుటుంబీకులు వైద్యులను కోరారు. వారు అంగీకరించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యురాలు వెంటనే పురుడు పోశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయని కుటుంబీకులు వాపోయారు. జ్వరం పేరిట తిప్పి పంపడం అన్యాయమని భర్త పరశురాం పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షణాధికారిణి డా.విజయలక్ష్మిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. గర్భిణికి అధిక జ్వరం రావడంతోనే నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేశామన్నారు. నిబంధనల మేరకు హైరిస్క్ కేసులకు ఇక్కడ వైద్యం అందించలేమని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Jammu Kashmir: జోషీమఠ్ తరహాలో.. జమ్మూలోనూ ఇళ్లకు పగుళ్లు..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
India News
Traffic Challan: పరిమిత కాలపు ఆఫర్.. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్!
-
Sports News
Prithvi Shaw: భారత ఓపెనర్‌గా పృథ్వీ షాకు అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04/02/2023)
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!