logo

కొలువే లక్ష్యంగా..

పోలీసు దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం నియోజకవర్గంలోని మండలాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ప్రారంభించి వారికి అండగా నిలుస్తున్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.

Published : 03 Dec 2022 03:41 IST

ఉచితంగా పోలీసు దేహదారుఢ్య శిక్షణ శిబిరాలు
యువతకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేయూత
న్యూస్‌టుడే, వేల్పూర్‌

శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

పోలీసు దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం నియోజకవర్గంలోని మండలాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ప్రారంభించి వారికి అండగా నిలుస్తున్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. 500 మందికి 100 రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించి.. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి పుస్తకాలు, బోధకులు, ఉచిత భోజన వసతి కల్పించారు. ఇందులో ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షల్లో అర్హత సాధించిన 168 మంది అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.

అందరి సహకారంతో..

పరుగు పందెం, షాట్‌ఫుట్‌, లాంగ్‌జంప్‌ విభాగాల్లో యువతీ, యువకులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో శిబిరాలు కొనసాగుతున్నాయి. పోటీకి ఎలా సన్నద్ధం కావాలో ఎస్సైలు, సీఐలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. మానసికంగా సన్నద్ధం కావడానికి యోగా నేర్పిస్తున్నారు. అభ్యర్థులకు జాతీయ స్థాయి క్రీడాకారులు సైతం సేవలు అందిస్తున్నారు. ప్రైవేటు శిక్షణ శిబిరాలకు దీటుగా యువతను తీర్చిదిద్దుతున్నారు.


సన్నద్ధమైతే సాధ్యమే..
- ప్రభాకర్‌రావు, ఆర్మూర్‌ ఏసీపీ

యువత అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. దేహదారుఢ్య పరీక్షలు కష్టమేమీ కాదు. తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా ఉద్యోగాలు సాధించాలి. మానసికంగా, శారీరకంగా సన్నద్ధమైతే కొలువు సాధించడం సులువు.


ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలి
- మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నియోజకవర్గ అభ్యర్థులు కూడా కొలువులు సాధించాలని శిబిరాలను ప్రారంభించా. నా శక్తి మేరకు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తా. శిబిరాల్లో శిక్షణ పొందినవారు ఉద్యోగాలు సాధిస్తే దానికంటే ఆనందం ఇంకోటి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని