logo

ఆరోగ్య ఆర్టీసీ

రీజియన్‌ పరిధిలో డిపోల వారీగా తొలి    విడతలో 6 వైద్య శిబిరాలు నిర్వహించారు. 3,210 మంది ఉద్యోగులు, సిబ్బందికి 17 రకాల పరీక్షలు చేశారు. ఫలితాల ఆధారంగా వారిని నాలుగు విభాగాలుగా విభజించనున్నారు.

Published : 03 Dec 2022 03:41 IST

ఉద్యోగుల భద్రతకు సంస్థ చర్యలు
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

రీజియన్‌ పరిధిలో డిపోల వారీగా తొలి విడతలో 6 వైద్య శిబిరాలు నిర్వహించారు. 3,210 మంది ఉద్యోగులు, సిబ్బందికి 17 రకాల పరీక్షలు చేశారు. ఫలితాల ఆధారంగా వారిని నాలుగు విభాగాలుగా విభజించనున్నారు. పూర్తి ఆరోగ్యవంతులు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండి వైద్యపరంగా అప్రమత్తంగా ఉన్నవారు, వైద్యం అవసరం ఉన్నవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిగా వర్గీకరించి చికిత్స అందించనున్నారు.

ఒత్తిడి అధిగమించేందుకు..:

ఇప్పటివరకు 400 మందికి బీపీ ఉన్నట్లు  ప్రాథమికంగా  నిర్ధారించారు. 120 మందికి మధుమేహం ఉన్నట్లు చెబుతున్నారు.   22 మంది తీవ్ర హృదయ సంబంధ ఇబ్బందులకు గురవుతున్నట్లు తేలింది.    ఉద్యోగులు ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని,    తేలికపాటి నడక, జాగింగ్‌ వంటివి చేస్తే కొంత ఒత్తిడిని   అధిగమించవచ్చని పేర్కొంటున్నారు.

మనుగడపై దృష్టి:

కొవిడ్‌ వేళ ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది. పాజిటివ్‌ కేసులు తగ్గాక కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి. ఏటా రీజియన్‌ పరిధిలో రూ.1.20 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.90 లక్షల నుంచి రూ.కోటి మేర సమకూరుతోంది. సిబ్బంది, ఉద్యోగులు బాగుంటేనే సంస్థ మనుగడ సాధ్యమని భావించి నూతన కార్యాచరణను అమలు చేస్తున్నారు.


పనిలో బిజీగా ఉండి..
లక్కు మల్లేశం, ఆర్టీసీ డీఎం

సంస్థ కోసం అహర్నిశలు పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం  ఎంతో ముఖ్యం. చాలా మంది పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని