logo

శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి: డీఈవో రాజు

విద్యార్థులు శాస్త్రీయ ద]ృక్పథంతో ఆలోచించాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకులంలో శుక్రవారం జాతీయ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించారు.

Published : 03 Dec 2022 03:41 IST

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులతో విద్యాశాఖ జిల్లా అధికారులు

కామారెడ్డి పట్టణం: విద్యార్థులు శాస్త్రీయ ద]ృక్పథంతో ఆలోచించాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకులంలో శుక్రవారం జాతీయ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విజ్ఞానంతోనే దేశ భవిష్యత్తు సాధ్యమన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఇతర అంశాలపై ఆసక్తి చూపాలన్నారు. వారం రోజుల వ్యవధిలోనే ప్రదర్శనకు 94 అంశాలు రావడం అభినందనీయమన్నారు. సాయికృష్ణ(జడ్పీహెచ్‌ఎస్‌- మహమ్మదాబాద్‌), చరణ్య(ఇసాయిపేట), సంకీర్తన(తుజాల్‌పూర్‌), శ్రావ్య(ఘన్‌పూర్‌), అభిలాశ్‌(పాల్వంచ), అమృత(ఆదర్శ - నిజాంసాగర్‌) ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. సైన్స్‌ జిల్లా అధికారి సిద్దిరాంరెడ్డి, అధికారులు శ్రీపతి, గంగాకిషన్‌, బాపురెడ్డి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, ప్రతాప్‌రెడ్డిలున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని