logo

14 గ్రామాలతో డోంగ్లీ మండలం

జిల్లాలో మరో కొత్త మండలం ప్రారంభానికి సిద్ధమైంది. మద్నూర్‌లోని 14 రెవెన్యూ గ్రామాలతో నూతనంగా ఏర్పాటైన డోంగ్లీని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించనున్నారు.

Published : 03 Dec 2022 03:41 IST

నేడు ప్రారంభోత్సవం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి - న్యూస్‌టుడే, మద్నూర్‌

జిల్లాలో మరో కొత్త మండలం ప్రారంభానికి సిద్ధమైంది. మద్నూర్‌లోని 14 రెవెన్యూ గ్రామాలతో నూతనంగా ఏర్పాటైన డోంగ్లీని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించనున్నారు. సెప్టెంబరు 26న ఈ మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ తహసీల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల్లో ఇక్కడి నుంచే రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ సేవలు అందించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత దశల వారీగా వ్యవసాయ, ఐకేపీ, వైద్య, పోలీసు కార్యాలయాలు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.

పల్లెల వివరాలు..  

1) డోంగ్లీ 2) మొగ 3) లింబూర్‌ 4) హసన్‌టాక్లీ 5) పెద్దటాక్లీ 6) సిర్‌పూర్‌ 7) మాదన్‌ హప్పర్గా 8) ఇలేగావ్‌ 9) ఎన్‌బుర 10) కుర్ల 11) దోతి 12) మల్లాపూర్‌ 13) లక్ష్మాపూర్‌ 14) మారెపల్లి

బహిరంగ సభ..  

మంత్రి హరీశ్‌రావు ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 11.30 గంటల వరకు పిట్లం చేరుకుంటారు. అక్కడ 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి, మార్కెట్‌ యార్డులో నూతనంగా నిర్మించిన దుకాణాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. డోంగ్లీలో మన ఊరు - మన బడి కింద పాఠశాల పునరుద్ధరణ పనులు మొదలు పెడతారు. ఆ తర్వాత నూతన మండలాన్ని లాంఛనంగా ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు