logo

నకిలీ విత్తనాలు అంటగట్టారని ఫిర్యాదు

మండల కేంద్రంలోని ఓ పురుగుల మందు దుకాణంలో 20మంది రైతులు 150 బస్తాల సన్న రకం వరి విత్తనాలను కొనుగోలు చేశారు.

Published : 03 Dec 2022 19:03 IST

బీర్కూర్: మండల కేంద్రంలోని ఓ పురుగుల మందు దుకాణంలో 20మంది రైతులు 150 బస్తాల సన్న రకం వరి విత్తనాలను కొనుగోలు చేశారు. వారం రోజులు గడిచినా విత్తనాలు మొలకెత్తకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వ్యవసాయ శాఖ ఏడీ వినయ్‌కుమార్‌, ఏవో కమల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. ఒక్కో బస్తా రూ.950పెట్టి కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాటిని పొలాల్లో వెదజల్లేందుకు మరింత ఖర్చయిందని తెలిపారు. కంపెనీ వాళ్లు తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని