logo

మూడేళ్లుగా బాగు చేయరా?

కమ్మర్‌పల్లి కస్తూర్బా పాఠశాలను ఆర్మూర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నసీం సుల్తానా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 04 Dec 2022 04:02 IST

కమ్మర్‌పల్లి కస్తూర్బా సిబ్బందితో సోలార్‌ హీటర్‌ గురించి ఆరా తీస్తున్న ఆర్మూర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నసీం సుల్తానా

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: కమ్మర్‌పల్లి కస్తూర్బా పాఠశాలను ఆర్మూర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నసీం సుల్తానా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ఈనాడు’ జిల్లా పత్రికలో ‘చన్నీళ్లే గతి’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా జడ్జి కుంచాల సునీత స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు ఆర్మూర్‌ జడ్జి పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సోలార్‌ హీటరు చెడిపోయినా మూడేళ్లుగా బాగు చేయించకపోవడంపై వివరాలు ఆరా తీశారు. శుక్రవారం రాత్రి మెకానిక్‌ వచ్చి విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వడంతో శనివారం ఉదయం వేడినీళ్లు అందించినట్లు ఇన్‌ఛార్జి ప్రత్యేకాధికారిణి దీప తెలిపారు. వంట గదులు, వండిన ఆహార పదార్థాలను చూశారు. పైకప్పునకు బూజు ఉండటంతో తొలగించాలన్నారు. ఆరో తరగతి విద్యార్థినులు సీఎం, గవర్నర్‌, పీఎం పేర్లు చెప్పకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడో తరగతి విద్యార్థినులు సైతం తమ పాఠ్యాంశాల గురించి సమాధానాలు రాకపోవడంతో టీచర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతివారం జనరల్‌ నాలెడ్జి నేర్పించాలని ఉపాధ్యాయులు, ఎంఈవో ఆంధ్రయ్యకు సూచించారు.

3వ తేదీన ప్రచురితమైన కథనం..


దివ్యాంగుడికి చక్రాల కుర్చీ అందజేత

ఎడపల్లి, న్యూస్‌టుడే: ఠాణాకలాన్‌కు చెందిన దివ్యాంగ యువకుడు సాయికి శనివారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భవానీ ప్రతినిధులు చక్రాల కుర్చీ అందజేశారు. నవంబరు 6న ‘ఈనాడు’లో ‘యాచిస్తూ.. ఆకలి తీరుస్తూ’ శీర్షికన ప్రచురితమైన చిత్ర వార్తకు క్లబ్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌ గౌడ్‌, రాజాగౌడ్‌ స్పందించి కుర్చీ అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని