logo

నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆచార్యులు లక్ష్మీనారాయణ కోరారు.

Updated : 04 Dec 2022 06:18 IST

 హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్య లక్ష్మీనారాయణ

‘రగిలే జ్ఞాపకం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గొర్రెపాటి మాధవరావు, ఇఫ్టూ నేత ప్రదీప్‌, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ తదితరులు

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆచార్యులు లక్ష్మీనారాయణ కోరారు. నిజామాబాద్‌ నగరంలో మూడు రోజులుగా కొనసాగిన పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యారంగానికి బడ్జెట్‌ పెంచాలని, ఖాళీలు భర్తీ చేయాలన్నారు. అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు ఉదయగిరి రాసిన ‘ఎగిసేటి యువ తరంగాలై’ పాట సీడీతో పాటు ‘రగిలే జ్ఞాపకం’ అనే పుస్తకాన్ని గొర్రెపాటి మాధవరావు, ఇఫ్టూ నేత ప్రదీప్‌, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌, నాగన్న, పాపయ్య, పరుచూరి శ్రీధర్‌, సాయిబాబా ఆవిష్కరించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి మహేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని