logo

కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడి

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్మించడం గొప్ప విషయమని ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ పేర్కొన్నారు. చదువుకున్న బడి మనకేమిచ్చింది.. మనం బడికేమిచ్చామని గుర్తుంచుకోవాలని సూచించారు.

Published : 04 Dec 2022 04:02 IST

వేదికపై ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జిల్లా పాలనాధికారి జితేశ్‌ వి పాటిల్‌, మధ్యప్రదేశ్‌  రాష్ట్ర  ముఖ్య కార్యదర్శి నరహరి, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

బీబీపేట, న్యూస్‌టుడే: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్మించడం గొప్ప విషయమని ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ పేర్కొన్నారు. చదువుకున్న బడి మనకేమిచ్చింది.. మనం బడికేమిచ్చామని గుర్తుంచుకోవాలని సూచించారు. బీబీపేటలో గతేడాది దాత సుభాష్‌రెడ్డి రూ.6 కోట్లతో నిర్మించిన బాలుర పాఠశాల మొదటి వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఆవరణలో తిమ్మయ్యగారి సుశీల-నారాయణరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. సోలార్‌ ప్లాంట్‌, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, భోజనశాలను ప్రారంభించారు. రూ.కోటి కార్పస్‌ ఫండ్‌ ఇచ్చిన పూర్వ విద్యార్థుల చిత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతర పాఠశాలల క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మధ్యప్రదేశ్‌ ముఖ్య కార్యదర్శి నరహరి, జిల్లా పాలనాధికారి జితేశ్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, పిన్నవయసులోనే ఎవరెస్టు అధిరోహించిన మలావత్‌ పూర్ణ, జడ్పీ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, ఎంపీపీ బాలామణి, సర్పంచి లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు పద్మిని, ఎంపీటీసీ సభ్యులు పల్లవి, నీరజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని