logo

అన్నీ ఒకే దగ్గర

వాహనదారుల మదిని దోచే ప్రముఖ కంపెనీలకు చెందిన వివిధ కార్లు, ద్విచక్ర వాహనాలు ఒకే చోట కొలువుదీరాయి. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో మారుతి సుజుకీ నెక్సా(వరుణ్‌ మోటార్స్‌) ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘ఆటో ఎక్స్‌పో-2022’ ఇందుకు వేదికైంది.

Updated : 04 Dec 2022 06:15 IST

ప్రదర్శనలో కార్లు, ద్విచక్రవాహనాలు
‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో-2022 ప్రారంభం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ క్రీడావిభాగం

మాట్లాడుతున్న పాలనాధికారి నారాయణరెడ్డి, చిత్రంలో ఎంవీఐ కిరణ్‌కుమార్‌, యూనియన్‌ బ్యాంకు ప్రతినిధి పృథ్వీరాజ్‌, డీటీసీ వెంకటరమణ, ‘ఈనాడు’ జోనల్‌ మేనేజర్‌  రవిచంద్రబాబు, మారుతి సుజుకీ నెక్సా వరుణ్‌ మోటార్స్‌ జీఎం రమణగుప్తా, కెనరా బ్యాంకు   ప్రతినిధి చంద్రశేఖర్‌, ‘ఈనాడు’ నిజామాబాద్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాస చక్రవర్తి

వాహనదారుల మదిని దోచే ప్రముఖ కంపెనీలకు చెందిన వివిధ కార్లు, ద్విచక్ర వాహనాలు ఒకే చోట కొలువుదీరాయి. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో మారుతి సుజుకీ నెక్సా(వరుణ్‌ మోటార్స్‌) ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘ఆటో ఎక్స్‌పో-2022’ ఇందుకు వేదికైంది. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఆటో ఎక్స్‌పోను శనివారం జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వాసులు తమకు నచ్చిన వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ కష్టపడకుండా ‘ఈనాడు’ అన్ని కంపెనీలను ఒకే దగ్గరకు చేర్చిందన్నారు. వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి వివిధ బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన విక్రయాలపై ఎంత ఆసక్తి చూపుతున్నారో... కొనుగోలుదారుల భద్రతపైనా అంతే దృష్టిసారించాలన్నారు. డీటీసీ వెంకటరమణ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చే సందర్శకులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేలా ఆయా కంపెనీల ప్రతినిధులు కృషి చేయాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించాలన్నారు. మారుతి సుజుకీ నెక్సా(వరుణ్‌ మోటార్స్‌) ప్రతినిధి రమణగుప్తా ప్రసంగిస్తూ.. ఆటోమొబైల్‌ రంగంలో మరింత వృద్ధి సాధించడానికి ఈ కార్యక్రమం చక్కగా దోహదపడుతుందన్నారు. వాహనాలు కొనుగోలు చేసేవారికి తక్కువ వడ్డీ రేటు, ఎలాంటి ప్రాసెసింగ్‌ ఛార్జీలు లేకుండా రుణాలు అందిస్తామని యూనియన్‌ బ్యాంకు ప్రతినిధి పృథ్వీరాజ్‌, కెనరా బ్యాంకు ప్రతినిధి చంద్రశేఖర్‌ తెలిపారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ నిజామాబాద్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాస చక్రవర్తి, జోనల్‌ మేనేజర్‌ రవిచంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాన స్పాన్సర్‌గా మారుతి సుజుకీ(వరుణ్‌ మోటార్స్‌), మీడియా పార్ట్‌నర్‌గా ‘ఈటీవీ తెలంగాణ’ వ్యవహరిస్తున్నాయి.

మారుతి సుజుకీ నెక్సా కంపెనీ కారును పరిశీలిస్తున్న పాలనాధికారి నారాయణరెడ్డి

* మారుతి సుజుకీ ఎరీనా, మారుతి సుజుకీ వరుణ్‌ మోటార్స్‌ నెక్సా, టాటా మోటార్స్‌, సాయి ఎస్‌ఆర్‌కే హోండా, మాలిక్‌ కియా, ప్రకాశ్‌ హ్యుందాయ్‌, హోండా, యమహా ఉదయ మోటార్స్‌, సిట్రోయెన్‌, టయోటా హర్షా ఆటో, సాయిరాం హోండా, టీవీఎస్‌ లక్ష్మి, కెనరా బ్యాంకు, రెనాల్ట్‌(పీపీఎస్‌ మోటార్స్‌), హీరో(వెంకటేశ్వర), మహీంద్రా ఆటోమోటివ్‌, యూనియన్‌ బ్యాంకు, మారుతి సుజుకీ కమర్షియల్‌ వాహనాలు ప్రదర్శనలో కొలువుదీరాయి.
ప్రత్యేకతలు

* టీవీఎస్‌ రైడర్‌ 125 సీసీ టీఎస్‌టీ స్మార్ట్‌ కనెక్ట్‌ వాహనాన్ని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి ఆవిష్కరించారు.

* సాయిరాం హోండా షైన్‌ 125 సీసీ వాహనాన్ని ఆ కంపెనీ ప్రతినిధులు ఉదయ్‌కుమార్‌, శ్రీధర్‌ కొనుగోలుదారుడు ఇమ్రాన్‌కు అందించారు.

* హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ వాహనాన్ని నవీపేట్‌ వాసి మహిపాల్‌, గ్లామర్‌ ఎక్స్‌టెక్‌ వాహనాన్ని జగిత్యాల వాసి వసంతకు హీరో వెంకటేశ్వర షోరూం ప్రతినిధులు అందజేశారు.  

* సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వాహనాలను ఆసక్తిగా చూశారు.  

* ఆటో ఎక్స్‌పో-2022 ఆదివారమూ కొనసాగనుంది.

* ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.

* ప్రవేశం ఉచితం.

ఉదయ యమహా ద్విచక్రవాహనాన్ని పరిశీలిస్తున్న డీటీసీ వెంకటరమణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని