logo

డబ్లింగ్‌ పనులకు ఆమోదం

మేడ్చల్‌-ముద్‌ఖేడ్‌ వయా నిజామాబాద్‌ డబ్లింగ్‌(రెండు లైన్ల) పనులకు రైల్వేబోర్డు ఇటీవల ఆమోదముద్ర వేసింది. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనుండగా 2023లో పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Published : 06 Dec 2022 06:21 IST

నిధులు విడుదలైతేనే మొదలు..

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ: మేడ్చల్‌-ముద్‌ఖేడ్‌ వయా నిజామాబాద్‌ డబ్లింగ్‌(రెండు లైన్ల) పనులకు రైల్వేబోర్డు ఇటీవల ఆమోదముద్ర వేసింది. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనుండగా 2023లో పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయితేనే నిజామాబాద్‌ జంక్షన్‌ మీదుగా కొత్తగా మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు నిజామాబాద్‌-సికింద్రాబాద్‌ మార్గంలో విద్యుదీకరణ పనులు చివరిదశకు చేరుకున్నాయి.

* ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ముద్‌ఖేడ్‌ వరకు చేపట్టాల్సి ఉంది. చివరి విడతలో భాగంగా రైల్వే అధికారులు 428 కి.మీ. మేర పనుల కోసం రూ.4,686 కోట్లతో గతంలోనే ప్రతిపాదనలు పంపారు.

ఏప్రిల్‌ నాటికి విద్యుదీకరణ

నిజామాబాద్‌-సికింద్రాబాద్‌ మార్గంలో 2023 ఫిబ్రవరిలోగా విద్యుదీకరణ పనులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌లోగా ట్రయల్‌ రన్‌ తదితర సాంకేతిక ప్రక్రియ పూర్తయి ఆమోదం రానుంది.

రైళ్ల రద్దీతో...

మహారాష్ట్రలో మన్మాడ్‌, తెలంగాణలో సికింద్రాబాద్‌ జంక్షన్ల మీదుగా రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపే నిజామాబాద్‌ జంక్షన్‌ మీదుగా మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే వాటిని కేటాయించలేదు. ఇప్పుడున్న సింగిల్‌ లైన్‌తో రోజువారీగా నడుస్తున్న 30కు పైగా రైళ్లతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. గూడ్స్‌ రైళ్లు పెరగటంతో పలు చోట్ల ఎక్కువసేపు ఆపాల్సి వస్తోంది. డబ్లింగ్‌ పనులు పూర్తయితేనే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.


దూరప్రాంతాలకు మరిన్ని రైళ్లు
- మనోహర్‌రెడ్డి, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు

చాలా ఏళ్ల తర్వాత డబ్లింగ్‌ పనులకు ఆమోదం తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేయాలి. ఈ పనులు పూర్తయితే దూరప్రాంతాలకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చే వీలుంది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని