రైతు వేదికల నిర్వహణకు నిధులు
రైతు వేదికల నిర్వహణకు సర్కారు ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. నిర్మించిన భవనాల వద్ద కనీస వసతులు కల్పించేందుకు ఒక్కో వేదికకు నెలకు రూ.9 వేల చొప్పున ఖర్చు చేసుకునే అవకాశం కల్పించింది.
జిల్లాకు రూ.48.60 లక్షలు విడుదల
నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి రైతు వేదిక భవనం
న్యూస్‌టుడే, ఆర్మూర్: రైతు వేదికల నిర్వహణకు సర్కారు ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. నిర్మించిన భవనాల వద్ద కనీస వసతులు కల్పించేందుకు ఒక్కో వేదికకు నెలకు రూ.9 వేల చొప్పున ఖర్చు చేసుకునే అవకాశం కల్పించింది. ఐదు నెలలకు సంబంధించిన నిధులు జిల్లాలో 108 వేదికలకు అందనున్నాయి. ప్రస్తుతం వీటిని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి జమ చేశారు. త్వరలో క్లస్టర్ల వారీగా అందజేయనున్నారు. రైతువేదిక పేరిట స్థానిక బ్యాంకుల్లో పొదుపు ఖాతా తీయాల్సి ఉంటుంది. ఏఈవోలు ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాల ప్రకారం డీఏవో పర్యవేక్షణలో ఖర్చు చేస్తారు.
ఇదీ పరిస్థితి..
సాగుకు సంబంధించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహించేందుకు దోహదపడతాయని చెప్పారు. 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున జిల్లాలో 108 వేదికలు నిర్మించారు. ఒక్కోదానికి సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. బీరువా, కుర్చీలు, బల్లలు, మైకుసెట్ తదితర సామగ్రి సమకూర్చారు. అయితే పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు తదితర వసతుల కల్పనకు నిధుల లేమి ఏర్పడింది. కొన్ని చోట్ల కనీసం భగీరథ కనెక్షన్లు సైతం ఇవ్వలేదు. సగానికి పైగా నామమాత్రంగా మిగిలిపోయాయి. ప్రభుత్వం 2020లో నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. తొలి ఏడాది ఇచ్చి తర్వాత ఆ ఊసెత్తలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే నిత్యం ఉదయం రెండు గంటల పాటు ఏఈవోలు రైతులతో సాగు వివరాలు చర్చించి, తదుపరి క్షేత్ర పర్యటన చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో పంటల వారీగా ఏం జరుగుతుందో తెలిసి సర్కారాలకు పట్టు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ నిధులతో పరిసరాలు శుభ్రత, వారానికి రెండు సార్లు శాస్త్రవేత్తలు, అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహించే అవకాశం ఏర్పడింది. రైతుబంధు సభ్యులు సైతం తమ భాగస్వామ్యాన్ని సహచరులతో పంచుకునే వీలుంది.
మెరుగైన సేవలందించేలా చర్యలు
- రాయుడు తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
ప్రభుత్వం కేటాయించిన నిధులు పారదర్శకంగా ఖర్చు చేయాలని సిబ్బందికి సూచించాం. ప్రస్తుతం ఒక్కో క్లస్టర్‌కు రూ.45 వేలు విడుదలయ్యాయి. దాదాపు అన్నిచోట్ల సౌకర్యాలు, అవసరమైన వసతులు కల్పించాం. నెలవారీగా ఏయే పనులకు ఎంత ఖర్చు చేయాలో స్పష్టత వచ్చింది. ఇకపై వేదికల ద్వారానే ఏఈవోలు సేవలందించాలని ఆదేశించాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!