వడివడిగా అడుగులు
జిల్లాకేంద్రంలో వైద్యకళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత ఆసుపత్రిలో 160 వరకు పడకలు ఉన్నాయి. వైద్యకళాశాలకు అనుబంధంగా మార్చాలంటే..
జిల్లా ఆసుపత్రిలో 330 పడకల ఏర్పాటుకు కసరత్తు
వైద్య కళాశాలకు అనుబంధంగా చర్యలు
న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం
జిల్లాకేంద్రంలో వైద్యకళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత ఆసుపత్రిలో 160 వరకు పడకలు ఉన్నాయి. వైద్యకళాశాలకు అనుబంధంగా మార్చాలంటే.. మొత్తం 330 పడకల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా దవాఖానాలో పైభాగాన మూడు షెడ్లు వేయాలని నిర్ణయించారు. జిల్లా పాలనాధికారి జితేష్ పాటిల్ సోమవారం వైద్యాధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
సిబ్బంది నియామకానికి..
భవనాల నిర్మాణానికి ఇప్పటికే రూ.263 కోట్లు కేటాయించారు. కళాశాలకు సంబంధించి అన్ని రకాల వైద్యులను నియమిస్తూ గతంలో సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా హెచ్వోడీలు, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.
పాత కలెక్టరేట్లో.. మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రాంతంలో కళాశాల ఏర్పాటుకు సంకల్పించారు. ఈ భవనాల నిర్మాణం నాలుగేళ్ల క్రితం ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. వచ్చే విద్యాసంవత్సరం కళాశాల ఏర్పాటుకు తప్పనిసరిగా చర్యలు చేపట్టే అవకాశాలు ఉండటంతో పాత కలెక్టరేట్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
అధికారి ఏమన్నారంటే.. ఈ విషయమై జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణాధికారిణి డా.విజయలక్ష్మిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ప్రస్తుత ఆసుపత్రిలోనే పైఅంతస్తులో షెడ్లు వేయాలనే ప్రతిపాదనను కలెక్టర్ తెచ్చారు. ఈ విషయమై కసరత్తు జరుగుతోందని ఆమె వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!