పౌరులు స్పందిస్తేనే ఫలితాలు మెరుగు
స్వచ్ఛ సర్వేక్షణ్-2023 లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పౌరుల స్పందన కీలకం కానుంది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఓటింగ్‌లో పాల్గొని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపితే చాలు.
స్వచ్ఛసర్వేక్షణ్ - 2023లో రాణించేందుకు దోహదం
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం
జిల్లాకేంద్రంలో చెత్త సేకరిస్తున్న సిబ్బంది
స్వచ్ఛ సర్వేక్షణ్-2023 లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పౌరుల స్పందన కీలకం కానుంది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఓటింగ్‌లో పాల్గొని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపితే చాలు. వీటి ఆధారంగా ప్రజా స్పందనకు మార్కులు వేయనున్నారు. ఈసారి(2022)లో స్వచ్ఛతలో కాస్త మెరుగయ్యారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాల కోసం కసరత్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో స్వచ్ఛసర్వేక్షణ్ సర్వేలో భాగంగా గతేడాది పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 10 ప్రశ్నలను సంధించగా.. జనాభాలో 20 శాతం పౌరుల నుంచే స్పందన వచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసినా ఆశించిన మేర అభిప్రాయాలు వెలిబుచ్చలేకపోయారు. ఈసారి స్పందన బాగుండేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు.
నూతన పురపాలికలు మెరుగుపడాలి.. నూతన పురపాలికలైన బాన్సువాడ, ఎల్లారెడ్డి గతేడాది నుంచి స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగస్వాములయ్యాయి. మెరుగైన ర్యాంకు సాధనలో ఈ రెండు విఫలమయ్యాయి. పంచాయతీ నుంచి పురపాలక స్థాయి రావడం, ఏళ్ల నాటి సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, చెత్త సేకరణలో పూర్వ పరిస్థితి ఉండటంతో సత్ఫలితాల సాధనలో వెనుకబడ్డాయి.
స్వచ్ఛంగా ఆలోచిస్తేనే.. బల్దియాల్లో పారిశుద్ధ్య విభాగంలో దస్త్రాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో ఎక్కువ శాతం మార్కులు కోల్పోతున్నారు. రద్దీకి అనుగుణంగా శౌచాలయాలు లేక సమస్యను జటిలం చేస్తోంది. 40 శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగడం లేదు. సేకరించినదాన్ని డంపింగ్‌యార్డుకు తరలించడంలో నిర్లక్ష్యం వీడటంలేదు. మురుగు కాల్వల్లో శుభ్రత లోపించడం, ప్రధాన ప్రాంతాల్లో చెత్త నిల్వకు డబ్బాలు లేకపోవడం, చెత్త నిల్వతో ఎరువుల తయారీ, డీఆర్సీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం తదితర కారణాలతో ఆశించిన రీతిలో ఫలితాలు రావడం లేదని పుర ప్రజలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని కామారెడ్డి బల్దియా కమిషనర్ దేవేందర్ ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!