logo

నాటి కీర్తనలు.. నేటి తరానికి

ఆధ్యాత్మిక ప్రియులకు అన్నమయ్య కీర్తనలు అంటే అమితమైన మక్కువ. వాటిని నేర్చుకోలేకపోయామని చాలా మంది అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.

Published : 06 Dec 2022 06:27 IST

సరస్వతి ఆలయంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పూర్ణదయాళ్‌

న్యూస్‌టుడే, బాన్సువాడ: ఆధ్యాత్మిక ప్రియులకు అన్నమయ్య కీర్తనలు అంటే అమితమైన మక్కువ. వాటిని నేర్చుకోలేకపోయామని చాలా మంది అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అలాంటి కీర్తనలపై ఆసక్తి, పట్టు ఉన్న ఓ వ్యక్తి వాటిని చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తున్నారు. ఆయనే బాన్సువాడ శాఖ ఎస్‌బీఐ మేనేజర్‌ పూర్ణదయాళ్‌. ఈయన పట్టణంలోని సరస్వతి ఆలయంలో దాదాపు 30 మంది చిన్నారులకు ఎనిమిది నెలలుగా ప్రతి గురువారం శిక్షణ ఇస్తున్నారు.

పుస్తకాలు కొనుగోలు చేసి

పూర్ణదయాళ్‌ది నస్రుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 14,800 అన్నమయ్య సంకీర్తనలను 29 పుస్తకాల్లో ముద్రించగా.. పూర్ణదయాళ్‌ వాటిని సహ ఉద్యోగి సహకారంతో కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారు. అనంతరం భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషల్లో పుస్తకాలు, సీడీలుగా రూపొందించి అన్నమయ్య సంకీర్తనలపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు.


చిన్నారుల కోసం సమయం కేటాయిస్తున్నా
పూర్ణదయాళ్‌, బాన్సువాడ  ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్‌

అన్నమయ్య కీర్తనలు అంటే నాకు ప్రాణం. చిన్నారులకు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రతి గురువారం వారికి రెండున్నర గంటల సమయం కేటాయిస్తున్నా. ఇప్పటికే చాలా మంది చిన్నారులు శిక్షణ పొంది బాగా పాడుతున్నారు. కీర్తనలు చాలా భాషల్లోకి తర్జుమా చేసి పుస్తకాలు, సీడీలు రూపొందించడంతో పాటు వెబ్‌సైట్‌లోనూ (www.annamayyabadi.com) ఉంచాను. అన్ని భాషల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని